
మంచు విష్ణు హీరోగా, ఇంటెన్స్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన సినిమా డైనమైట్. తెలుగు సినిమాకు కొత్తదైన యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గత శుక్రవారం పెద్ద ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ థ్ర్రిల్లర్ సినిమాలోని యాక్షన్‌కు అంతటా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విష్ణు చేసిన కొన్ని రిస్కీ ఫైట్స్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమాపై మొదట్నుంచీ ఉన్న క్రేజ్, భారీ ప్రమోషన్స్, థ్రిల్లర్ కాంటెంట్ వంటి అంశాలు డైనమైట్‌కు మొదటివారాంతం మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో డైనమైట్ యాక్షన్ సీక్వెన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు సినిమాలో ఇప్పటివరకూ రాని తరహా యాక్షన్ ఎలిమెంట్స్ కొన్ని డైనమైట్‌లో ఆకర్షణగా నిలిచాయి. దీంతో బీ,సీ సెంటర్లలో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. దేవాకట్టా ఇంటెన్స్ టేకింగ్, విష్ణు పర్ఫామెన్స్, హై రేంజ్ స్టంట్స్ లాంటివి ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచాయి. తమిళ సినిమా అరిమ నంబికి రీమేక్ అయిన డైనమైట్ సినిమాను విష్ణు తన సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నిర్మించారు. విష్ణు సరసన హీరోయిన్‌గా ప్రణీత నటించారు.

