‘డెకాయిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Dacoit

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రైమ్ డ్రామా ‘డెకాయిట్’. యాక్షన్‌తో కూడిన ఈ లవ్‌స్టోరీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 8 నుంచి ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, ఇప్పుడు నేరుగా ఓటీటీలో వీక్షించవచ్చు. ఇక ఈ చిత్ర దర్శకుడు షానియెల్‌ డియోతో కలిసి శేష్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే రాయడం విశేషం.

కాగా హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ ఆకట్టుకున్నారు. అనురాగ్‌ కశ్యప్‌, అతుల్‌ కులకర్ణి, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొత్తమ్మీద ‘డెకాయిట్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. అడవి శేష్, మృణాల్ ఠాకూర్ నటన సినిమాకు బాగా ప్లస్ అయింది. అలాగే, టేకింగ్ అండ్ మేకింగ్ కూడా సినిమా స్థాయిని పెంచాయి. ఈ సినిమాకు నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్.

Exit mobile version