న్యూ ట్రెండ్ – ఫేమస్ సాంగ్స్ తో డెకరేట్ అవుతున్న తెలుగు మూవీ టైటిల్స్

న్యూ ట్రెండ్ – ఫేమస్ సాంగ్స్ తో డెకరేట్ అవుతున్న తెలుగు మూవీ టైటిల్స్

Published on Jun 16, 2014 12:11 PM IST

movies
ప్రస్తుతం టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ మొదలయ్యింది. అది సినిమాల విషయంలో కాదు జస్ట్ సినిమా టైటిల్స్ విషయంలో మాత్రమే.. ఈ మధ్య కాలంలో చిన్న సినిమా హీరోలు తమ సినిమాలకు స్టార్ హీరోల సినిమాల్లో బాగా హిట్ అయిన పాటలోని లైన్స్ ని తీసుకొని తమ సినిమాలకి టైటిల్స్ గా పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ సరికొత్త ట్రెండ్ ని దాదాపు అందరు చిన్న హీరోలు ఫాలో అవుతున్నారు.

సచిన్ జోషి, నజియా జంటగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఆషికి 2’ సినిమాకి ‘నీ జతగా నేనుండాలి’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఇటీవలే సుదీర్ బాబు హీరోగా ప్రారంభమైన సినిమాకి ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనే టైటిల్ పెట్టారు. వారాహి బ్యానర్ పై వస్తున్న రెండు సినిమాలకు ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ అనే టైటిల్స్ ని పెట్టారు. సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న సినిమాకి ‘రారా క్రిష్నయ్య’ అనే టైటిల్ ని పెట్టారు. అలాగే సాయి ధరమ్ తేజ్, రెజీనా జంటగా నటిస్తున్న సినిమాకి పవన్ గబ్బర్ సింగ్ లో బాగా ఫేమస్ అయిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ అనే టైటిల్ ని పెట్టారు.

ఇవి కాకుండా ఇలా ఫేమస్ సాంగ్స్ లైన్స్ తో తెరకెక్కుతున్న సినిమాల టైటిల్స్ మీ కోసం.. ‘గుండెల్లో గుచ్చి గుచ్చి చంపకే’, ‘గురువారం మార్చి ఒకటి’, ‘గుండె నిండా గుడి గంటలు’, ‘తొలి సంధ్య వేళలో’, ‘ఐ యామ్ ఇన్ లవ్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘సీతమ్మ అందాలు రామయ్య వాయనాలు’, ‘కిరాక్’ లాంటి పేర్లతో తెరకెక్కుతున్న సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

తాజా వార్తలు