దీక్షాసేథ్‌కు బంపర్ ఆఫర్!

Deeksha_seth-2
వేదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భామ.. దీక్షా సేథ్. ఆ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలతో రాణించిన దీక్షా, అడపదడపా తమిళంలోనూ నటించింది. ఇక తాజాగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టిన దీక్షాకు మొదటి సినిమాయే తీవ్ర నిరాశను మిగిల్చింది. ‘లేకర్ హం దీవానే దిల్’ పేరుతో విడుదలైన ఆ సినిమా భారీ ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత దీక్షాకు ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం పెద్దగా ఆఫర్లేవీ లేని ఆమెకు కోలీవుడ్‌లో మంచి ఆఫర్ వచ్చింది.

వినూత్న సినిమాల ద్వారా కోలీవుడ్‌లో మంచి దర్శకుడిగా పేరున్న సెల్వరాఘవన్ సినిమాలో హీరోయిన్ చాన్స్ దీక్షను వరించింది. శింబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్ళింది. ఇక సెల్వరాఘవన్ గత చిత్రం ‘ఇరండామ్ ఉలగమ్’ (తెలుగులో వర్ణ) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2013లో విడుదలైన ఈ సినిమా తర్వాత సెల్వరాఘవన్ సినిమాలకు దూరమయ్యాడనే వార్తలు కూడా వినిపించాయి. అయితే.. ఈసారి ఇక పకడ్బందీ స్క్రిప్ట్ ద్వారా శింబుతో సినిమా చేస్తున్నారు సెల్వరాఘవన్.

Exit mobile version