
‘వేదం’ సినిమాతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన దీక్షా సేథ్.. తన అందం, అభినయంతో ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఒక రెండేళ్ళ పాటు వరుస తెలుగు సినిమాలతో పాటు అడపదడపా తమిళంలోనూ సినిమాలు చేస్తూ మెప్పించిన దీక్షాకు సరైన హిట్ ఒక్కటి కూడా దక్కకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి. ఈ క్రమంలోనే ఆమె హిందీ పరిశ్రమలోకీ అడుగు పెట్టి అదృష్టం పరీక్షించుకోగా, అక్కడా ‘లేకర్ హం దీవానే దిల్’ పేరుతో భారీ పరాజయం దక్కింది.
2014లో విడుదలైన ఈ సినిమా తర్వాత దీక్షా సేథ్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈమధ్యనే శింబు సినిమాలో ఆఫర్ వచ్చి, చివరి నిమిషంలో చేజారిపోయింది. దీంతో దీక్షా సేథ్ కెరీర్ పూర్తైందన్న మాటలు కూడా వినబడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో కన్నడలో ఓ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకొని తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నిస్తోంది దీక్షా. కన్నడలో మంచి గుర్తింపు ఉన్న హీరో దర్శక నటిస్తోన్న కొత్త సినిమా ‘జగ్గు దాదా’లో దీక్షా హీరోయిన్గా ఎంపికైంది. కొత్త దర్శకుడు రాఘవేంద్ర హెగ్దే ఈ సినిమానుతెరకెక్కించనున్నారు. ఈనెల్లోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.