హృతిక్ “ఫైటర్” నుంచి దీపికా లుక్, రోల్ రివీల్.!

FIghter 1

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోగా ఇప్పుడు బాలీవుడ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా “ఫైటర్” కోసం అందరికీ తెలిసిందే. సిద్ధార్థ్ నుంచి పఠాన్ తర్వాత వస్తున్నా సినిమా ఇది కావడం అలాగే హృతిక్ తో “వార్” తర్వాత చేస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ హైప్ అయితే నెలకొంది.

మరి ఈ చిత్రం నుంచి మేకర్స్ నిన్ననే హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఈరోజు హీరోయిన్ దీపికా పదుకోన్ పాత్ర మరియు ఆమె లుక్ ని అయితే రివీల్ చేశారు. దీనితో ఈమె కూడా ఇందులో ఓ సోల్జర్ గా కనిపిస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అలాగే ఈమె మిన్నీ అనే పాత్రలో కనిపిస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. ఇక ఈ అవైటెడ్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Exit mobile version