
రెండు అగ్ర నిర్మాణ సంస్థల కలయికలో సందీప్ కిషన్, సురభిలు జంటగా నటిస్తున్న చిత్రం ‘బీరువా’. ఈ సినిమా టైటిల్ దగ్గరనుండే ఆసక్తిరేకెత్తించడంలో సఫలమయ్యింది. ఇటీవలే విడుదలైన ఆడియోలో తమన్ అందించిన స్వరాలకు ప్రశంసలు అందుతున్నాయి.
అయితే ఈ నెల 23న విడుదల కావాల్సిన ఈ సినిమా తదుపరి వారానికి వాయిదాపడినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోయినా అదేరోజున కళ్యాణ్ రామ్ ‘పటాస్’, అల్లరి నరేష్ ‘బందిపోటు’ విడుదలకారణంగా చిత్రబృందం ఈ ‘బీరువా’ని లేటుగా తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలకోసం మా సైట్ ని చూస్తూ వుండండి