ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆచితూచి ఆడింది. అభిషేక్ పొరెల్(49), కేఎల్ రాహుల్ (38), అక్సర్ పటేల్ (34), ట్రిస్టన్ స్టబ్స్(34 నాటౌట్) రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది.
ఇక 189 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్(51), సంజూ శామ్సన్ (31), నితీష్ రానా (51) పరుగుల వర్షం కురిపించడంతో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి స్కోర్ టై చేశారు. దీంతో సూపర్ ఓవర్‌లో రెండు జట్లు తలబడ్డాయి. ఇక సూపర్ ఓవర్‌లో డ్రామా క్రియేట్ అయ్యింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు మాత్రమే సాధించింది. అటుపై బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ 13 పరుగులతో విజయాన్ని అందుకుంది. ఇలా సూపర్ ఓవర్‌లో సూపర్ విక్టరీ అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్.
