అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ (Lenin) చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్ లో చేస్తున్నాడు. వచ్చే వారం నుండి ఈ చిత్రం క్లైమాక్స్ ను షూట్ చేయనున్నారు. ఈ క్లైమాక్స్ షూట్ అనంతరం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. అఖిల్ తన పాత్రకు తానే చిత్తూరు యాసలో డబ్బింగ్ చెప్పనున్నారు. కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది.
ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ సినిమా పై మాత్రం మంచి హైప్ ఉంది.
