‘దేవర సీక్వెల్’ కచ్చితంగా ఉంటుందని ఆ మధ్య ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. దీంతో, ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, ‘దేవర’ వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు గడిచినా, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సీక్వెల్ జాడ మాత్రం కనిపించడం లేదు. స్క్రిప్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్‌కు అసంతృప్తి ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టారనే ఊహాగానాల మధ్య, యువసుధ ఆర్ట్స్ నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ‘దేవర 2’ అనుకున్న ప్రకారమే జరుగుతోందని అభిమానులకు భరోసా ఇచ్చారు.
పైగా 2026 మేలో షూటింగ్ ప్రారంభమవుతుందని, 2027లో విడుదల ఉంటుందని సుధాకర్ మిక్కిలినేని తెలిపారు. అయితే, ఆ ప్రకటన తర్వాత ఎటువంటి స్పష్టమైన అప్ డేట్ రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున కూడా అప్ డేట్ ఇవ్వలేదు. ఈరోజు కొరటాల శివ పుట్టినరోజు కావడంతో, అందరి దృష్టి మళ్లీ ‘దేవర సీక్వెల్’పైకి మళ్లింది. చిత్ర బృందం మరి అప్ డేట్ ఇస్తోందా ? లేదా ? అనేది చూడాలి. ప్రస్తుతం కొరటాల శివ బాలయ్యతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
