పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు రిలీజ్ కి రాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేయగా ఈ ఈవెంట్ మంచి ఉత్సాహంగా కూడా జరిగింది. అయితే సినిమా యూనిట్ అంతా వచ్చారు. హీరో హీరోయిన్స్, నిర్మాతలు అలాగే సాహిత్య రచయితలు కూడా వచ్చారు.
కానీ ఈ ఈవెంట్ లో మాత్రం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లేని లోటు ఖచ్చితంగా కనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ప్రతీ సినిమా ఈవెంట్ లో కనిపించి తన మార్క్ ఎనర్జీతో స్పెషల్ పెర్ఫామెన్స్ లు కూడా చేశారు. లాస్ట్ టైం తన భారీ ఈవెంట్ పుష్ప 2 కి కూడా అప్పట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా హాజరయ్యి అదరగొట్టారు.
కానీ ఇప్పుడు ఉస్తాద్ ఈవెంట్ లో తన ప్రెజెన్స్ లేకపోవడం మాత్రం ఫ్యాన్స్ లోనే ఒకింత డిజప్పాయింట్ చేసింది. ఇదే హరీష్ శంకర్ తో చేసిన గబ్బర్ సింగ్ టైం లో మూమెంట్స్ అభిమానుల్లో ఇప్పటికీ చిరస్థాయిగా ఉన్నాయి. అలాంటి కాంబినేషన్ నుంచి ఇలాంటి మిస్సింగ్ ఒకింత డిజప్పాయింట్ చేసే అంశమే అని చెప్పక తప్పదు.
