దెయ్యాలున్నాయా? చిత్రం ప్రారంభం..!

deyyalunnaya

కంకణాల శ్రీనివాస్ రెడ్డి స్వాయ దర్శకత్వంలో, శ్రీ ప్రణయ్ ఆర్ట్ ఫిలిం బ్యానర్‌పై ఎల్ విజయ్ మనోహర్ రావు (త్రయోటెక్స్) సమర్పణలో తెరకెక్కిస్తున్న చిత్రం దెయ్యాలున్నాయా? జైహింద్ గౌడ్ ప్రధాన పాత్రలో, కొత్త హీరోయిన్ ప్రియాంక, గౌతమ్ రాజు, హేమసుందర్, రఘునాధ్ రెడ్డి, వంశీ మాదారపు తదితరులు నటిస్తున్న ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

జైహింద్ గౌడ్, ప్రియాంకాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఏలూరు సురేందర్ రెడ్డి క్లాప్ ఇవ్వగా, మన్సూరాబాద్ కార్పోరేటర్ కొప్పుల నరసింహ రెడ్డి స్విచ్ ఆన్ చేయగా, బీమ్ రెడ్డి మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శక నిర్మాత కంకణాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నలుగురు కుర్రాళ్ళు, ఇద్దరు అమ్మాయిలు మెయిన్ లీడ్‌గా కామెడీ, హర్రర్, థ్రిల్లర్ నేపద్యంలో ఓ ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని అన్నారు. దెయ్యాలున్నాయా అనే టైటిల్ అందరిలో ఆసక్తి రేకెత్తించేలా ఉందని, ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుందని అన్నారు. జైహింద్ గౌడ్ మాట్లాడుతూ ఈ కథ, ఇందులో పాత్ర నాకు బాగా నచ్చిందని, ఇందులో నేను ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తున్నామని చెప్పుకొచ్చారు.

Exit mobile version