‘పవన్, లోకేష్’లపై శివాజీ కామెంట్స్ వైరల్ !

Sivaji

నటుడు శివాజీ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఐతే, తాజా ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ.. ‘ఇక నాకెందుకు రాజకీయాలు.. హాయిగా సినిమాలు చేసుకుంటాను. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. అలాగని ఏదీ గమనించకుండా లేను. ఎక్కడైనా శృతి మించితే నేను మాట్లాడతాను. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర మాత్రమే అయ్యింది, కాబట్టి సర్దుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. ఈ ప్రభుత్వం మంచి చేస్తోంది అని ప్రజలు నమ్ముతున్నారు’ అని శివాజీ తెలిపారు.

శివాజీ ఇంకా మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని తిట్టారో అందరికీ తెలుసు. చివరికి ఏమైంది? ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. లోకేష్ బాబు గారిని పప్పు పప్పు అన్నారు. కానీ ప్రపంచం ఆయన పప్పు కాదు నిప్పు అని తేల్చింది. పప్పు పప్పు అని లోకేష్ బాబుని రెచ్చగొట్టి నిప్పులు చేసింది వీళ్లే. రాజకీయం చేస్తే ప్రజలు మన వెనకాల నిలబడాలి తప్ప.. భయపడకూడదు’ అంటూ శివాజీ చెప్పుకొచ్చారు.

Exit mobile version