విడుదల తేదీ : ఆగస్టు 02, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : దొర సాయి తేజ, అక్షర నల్ల, నితిన్ ప్రసన్న, కిరణ్ కుమార్ కామ్తం, సూరి కే చాప్లిన్, విక్రమ్ దేవాకి తదితరులు.
దర్శకత్వం : ఆదిత్య దేవులపల్లి
కథ : విజయ్ కుమార్
సంగీతం : రిషి ఎమ్
నిర్మాణ సంస్థ : ఛాయ్ షాట్స్
ఛాయాగ్రహణం : అశ్విన్ లెనిన్
కూర్పు : జగదీష్ గౌడ్
కళా దర్శకత్వం : సంజన కంచాల
సంబంధిత లింక్స్ : ట్రైలర్
దొర సాయి తేజ హీరోగా నటించిన లేటెస్ట్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఛాయ్ షాట్స్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
బాల్యంలో పేదరికంతో కష్టాలు పడిన బీటెక్ స్టూడెంట్ అరవింద్(దొరసాయి సాయి తేజ) డబ్బు కోసం సైబర్ మోసాల వైపు వెళ్తాడు. తన బ్రిలియంట్ థాట్స్ తో అమాయకులను ఈజీగా బోల్తా కొట్టిస్తూ ఉంటాడు. దీంతో హైదరాబాద్ వేదికగా మాఫియా నడుపుతున్న ప్రకాష్ ఠాగూర్ ని అట్రాక్ చేస్తాడు. అరవింద్ తెలివితేటలకు ఫిదా అయిన ప్రకాష్ ఠాగూర్… తన గ్యాంగ్ లో చేర్చుకుంటాడు. అరవింద్ ఎంట్రీతో ప్రకాష్ ఠాగూర్ దందా విస్తరిస్తుంది. అరవింద్ గ్యాంగ్ లో కీలకంగా ఎదుగుతాడు. ఆన్లైన్ ఫ్రాడ్స్ ని సీరియస్ గా తీసుకున్న గవర్నమెంట్ పోలీస్ అధికారి ఆదిత్య సింగ్(నితిన్ ప్రసన్న) ని రంగంలోకి దించుతుంది. మరోవైపు అరవింద్ కి తన క్లాస్ మేట్ నీలు (అక్షర నల్లా) అంటే చాలా ఇష్టం. నాటకీయంగా ఆమెను ఇంప్రెస్ చేసి, ప్రేమించేలా చేసుకుంటాడు. మరి అరవింద్ చీకటి కోణం నీలుకు తెలుస్తుందా? ఆదిత్య సింగ్ నుండి అరవింద్ తప్పించుకోగలడా? అరవింద్ లవర్ నీలుకు ఆదిత్య సింగ్ కి ఉన్న కనెక్షన్ ఏమిటో తెలియాలంటే… దందా మూవీ చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
సైబర్ నేరగాళ్ళ మోసాల నేపథ్యాన్ని ఈ సిరీస్ లో చాలా బాగా చూపించారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల ఆధారంగా కథను రాసుకోవడంతో.. సిరీస్ ఆకట్టుకుంది. ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర అరవింద్ పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన సైబర్ క్రైమ్ ట్రాక్.. అలాగే, ఆ ట్రాక్ తో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ‘‘దందా’’ సిరీస్ కొన్ని చోట్ల బాగుంది. ముఖ్యంగా సైబర్ మోసాలతో సాగే కొన్ని సీన్స్ సిరీస్ కి ప్లస్ అయ్యాయి.
ఇక ఈ సిరీస్ లో హీరోగా నటించిన దొర సాయి తేజ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. తన నటనతో సిరీస్ కే మెయిన్ హైలైట్ గా నిలిచాడు. తన డైలాగ్ డెలివరీతో పాటు తన మ్యానరిజమ్ తో కూడా చాలా బాగా ఆకట్టుకున్నాడు. అలాగే, హీరోయిన్ పాత్రలో నటించిన అక్షర నల్ల కూడా చాలా బాగా నటించింది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. అలాగే, మిగిలిన కీలక పాత్రల్లో కనిపించిన నితిన్ ప్రసన్న, కిరణ్ కుమార్ కామ్తం, సూరి కే చాప్లిన్ నటన కూడా ఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్ :
‘’దంధా’ సిరీస్ లో స్టోరీ పాయింట్ అలాగే ట్రీట్మెంట్ బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్ గానే సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికితోడు కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు.
కొన్ని చోట్ల బిజినెస్ మెన్ సినిమా గుర్తుకు వస్తూ ఉంటుంది. నిజానికి కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలను కూడా ఇంకా బెటర్ గా రాసుకుని ఉండి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
సినిమాలో దర్శకుడు ఆదిత్య దేవులపల్లి చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కొన్ని చోట్ల కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు రిషి ఎమ్ సమకూర్చిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. వాటిని తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఛాయ్ షాట్స్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు:
‘దంధా’ అంటూ వచ్చిన ఈ సైబర్ క్రైమ్ డ్రామా బాగుంది. కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు క్లైమాక్స్ బాగున్నాయి.
దొర సాయి తేజ నటన చాలా బాగుంది. తన నటనతో సిరీస్ స్థాయిని పెంచాడు. ఐతే, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లేలో ఫ్లో మిస్ కావడం సిరీస్ కి మైనస్ అయింది. ఓవరాల్ గా ఈ సిరీస్ లోని సైబర్ క్రైమ్ ఎలిమెంట్స్ కచ్చితంగా కనెక్ట్ అవుతాయి.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
