
ధనుష్ నటించిన వేలయిళ్ళ పట్టతారి(వి.ఐ.పి) సినిమా తమిళనాట ఘనవిజయం సాధించి ధనుష్ స్టామినా ఏంటో భారతదేశం మొత్తం తెలిసేలా చేసింది. ఇప్పుడు ఆ సినిమాను ‘రఘురామ్ బి.ఈ’ పేరుతొ తెలుగులోకి అనువదించనున్నారు
ఒక నిరుద్యోగి భవననిర్మాణ సంస్థలో ఎలా ఉద్యోగం సంపాదిస్తాడు అన్నది ఈ సినిమా కధాంశం. ధనుష్ సరసన ఈ సినిమాలో అమలాపాల్ నటించింది. వేల్ రాజ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ‘వై దిస్ కొలవెరి డి’ పాటను స్వరపరిచిన అనిరుద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు