‘ధర్మస్థల నియోజకవర్గం’ విడుదల తేదీ ఖరారు.. పీవీఆర్ సినిమాస్ ద్వారా డిస్ట్రిబ్యూషన్

‘ధర్మస్థల నియోజకవర్గం’ విడుదల తేదీ ఖరారు.. పీవీఆర్ సినిమాస్ ద్వారా డిస్ట్రిబ్యూషన్

Published on Aug 20, 2026 8:00 AM IST

​సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించిన ఈ పొలిటికల్ డ్రామా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది.

​ఈ సినిమాలో నటిగా తనకు మంచి గుర్తింపు తెచ్చే పాత్ర లభించిందని వితికా షేరు పేర్కొన్నారు. సమాజానికి అవసరమైన ఒక స్పష్టమైన సందేశం ఇందులో ఉందని నటి కస్తూరి తెలిపారు. కథ నచ్చడంతోనే ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యానని, క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చిత్ర యూనిట్ శ్రమించిందని సీనియర్ నటుడు సుమన్ అన్నారు.

​అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని తీర్చిదిద్దామని దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట, నిర్మాత మేరుం భాస్కర్ వెల్లడించారు. ఈ చిత్రానికి మహావీర్ ఎల్లంధర్ సంగీతం అందించగా, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, కాలకేయ ప్రభాకర్, పృథ్వీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు