
గతంలో వరుసపెట్టి ఫ్యామిలీ హిట్లతో తనకంటూ క్రేజ్ ని సంపాదించుకుని ఇటీవల కాలంలో తన ఫ్యామిలీ ఇమేజ్ ని కోల్పోయి దానిని తిరిగి రాబట్టుకునే ప్రయత్నంలో వున్న హీరో శ్రీకాంత్ నటించిన తదుపరి చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. ‘ఢీ అంటే ఢీ’ అనే టైటిల్ తో ఈ చిత్రానికి నామకరణం చేసారు. శ్రీకాంత్ సరసన ఈ సినిమాలో సోనియామాన్ నటిస్తుంది.
కొద్దిసేపటి క్రితమే ప్రసాద్ ల్యాబ్స్ లో ప్లాటినం డిస్క్ వేడుకలను నిర్వహించుకున్న ఈ చిత్రం మే 15న మన ముందుకురానున్నట్టు సమాచారం. బంగారుబాబు, జగపతి వంటి చిత్రాలను తెరకెక్కించిన జొన్నలగడ్డ శ్రీనివాస రావు ఈ చిత్రానికి దర్శకుడు. బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి ముఖ్యపాత్రధారులు. ఈ సినిమాకు చక్రి సంగీతం అందించడం విశేషం. జ్యోతిక, సి.ఎస్ రెడ్డి, సూర్యప్రకాష్ లు నిర్మాతలు.