విక్రమ్ ఆ సినిమాను పూర్తి చేస్తాడట !

Chiyaan Vikram

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న చిత్రం ‘ధ్రువ నట్చత్తిరమ్’. ఈసినిమా స్టార్ట్ అయ్యి రెండేన్లు కావస్తున్నా ఇంతవరకు ఈసినిమా షూటింగ్ పూర్తి కాలేదు. సినిమా ను మొదలుపెట్టినప్పడినుండి ఏదో ఒక సమస్యతో అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. తాజాగా విక్రమ్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న ‘కదరం కొండన్’ అనే చిత్ర షూటింగ్ నిన్నటితో పూర్తి అయ్యింది. దాంతో ఆయన ధ్రువ నట్చత్తిరమ్ పూర్తి చేసే పనిలో వున్నాడట. ఈచిత్రం యొక్క ఫైనల్ షెడ్యూల్ వచ్చే ఏడాది జనవరి రెండవ వారంలో స్టార్ట్ కానుంది. సుమారు 14రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది.

హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2019 ఫస్ట్ హాఫ్ లో విడుదలకానుంది.

Exit mobile version