సమీక్ష: ‘కేడీ’ – రొటీన్ బోరింగ్ యాక్షన్ డ్రామా

KD: The Devil

విడుదల తేదీ : మే 15, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : ధృవ్ సార్జా, రేష్మ ననయ, సంజయ్ దత్, శిల్పా శెట్టి, రమేష్ అరవింద్, రవి శంకర్ తదితరులు
దర్శకుడు : ప్రేమ్
నిర్మాణం : కే వి ఎన్ ప్రొడక్షన్స్
సంగీతం : అర్జున్ జన్యా
ఛాయాగ్రహణం : విలియం డేవిడ్
కూర్పు : సంకేత్ ఆచార్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధృవ్ సార్జా హీరోగా నటించిన మరో అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే ‘కేడీ’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

1980 ల సమయంలో డాక్ దేవాగా పిలవబడే దేవా అనే అండర్ వరల్డ్ డాన్ (సంజయ్ దత్) అంటే బెంగళూరు పోలీసులకి కూడా దడ. తనకి ఎదురు నిలిచే మగాడు కూడా అక్కడ ఉండడు. అలాంటి డాన్ కి వీరాభిమాని అత్యంత అమాయకుడు కాళీ అలియాస్ కాళిదాసు – KD (ధృవ్ సార్జా) అయితే తనకి చదువు సరిగ్గా అబ్బలేదని తన సొంత అన్నయ్య టీచర్ గా పని చేసే ధర్మ (రమేష్ అరవింద్) తనతో మాట్లాడ్డం మానేస్తాడు. మరి ఈ అన్నయ్య అంటే కూడా కాళీకి ఎంతో ప్రాణం అలాంటిది ఈ అన్నయ్య తన కుటుంబం మీదకి దేవా ఎందుకు హత్యా ప్రయత్నం చేస్తాడు? ఈ సమయంలో కాళీ ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు? ఈ మధ్యలో మరో పవర్ఫుల్ డాన్ భైరవ (?) ఎవరు? అసలు కాళీకి దేవా అంటే ఎందుకు అంత ఇష్టం అంత గౌరవం? అలాంటి వ్యక్తికే తను ఎలా ఎదురు తిరిగాడు? ఈ క్రమంలో దేవా భార్య సత్య (శిల్పా శెట్టి) చేసిన శపథం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో ధృవ్ సార్జా మెయిన్ లీడ్ అయినప్పటికీ నటుడు సంజయ్ దత్ మాత్రం మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు అని చెప్పొచ్చు. దర్శకుడు సంజయ్ ని ప్రెజెంట్ చేసిన తీరు సినిమాల్లో ఉన్న మేజర్ హైలైట్ అనుకోవచ్చు. తనపై డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు గాని కొన్ని మాస్ సీన్స్ వంటివి మాస్ ఆడియెన్స్ కి మంచి యాక్షన్ మూవీ లవర్స్ కి ట్రీట్ అందిస్తాయి.

అలానే ధృవ్ కూడా తన రోల్ లో బాగానే చేసాడు. తన గత సినిమా మార్టిన్ తో పోలిస్తే ఇందులో కొంచెం బెటర్ అనుకోవచ్చు. యాక్షన్ పార్ట్ పక్కన పెడితే ఒక అమాయక మొండి కుర్రాడి పాత్రలో బాగా చేసాడు. అలానే నటి శిల్పా శెట్టికి సాలిడ్ రోల్ ఇందులో దక్కింది. తన స్క్రీన్ స్పేస్ తక్కువే ఉంది కానీ కనిపించిన కొంతసేపు కూడా ఆ ఇంపాక్ట్ కలిగించే సీన్స్ బాగున్నాయి.

అలాగే హీరో అన్నయ్య పాత్రలో నటించిన రమేష్ అరవింద్ అదే యంగ్ ఏజ్ లుక్స్ తో కనిపిస్తూ మంచి పెర్ఫామెన్స్ అందించారు. అలానే క్లైమాక్స్ పార్ట్ లో కిచ్చా సుదీప్ కామియోలో ఆకట్టుకున్నారు. ఇక వీటితో పాటుగా సినిమాలో కొన్ని కొన్ని మాస్ మూమెంట్స్ పర్వాలేదు అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఇది కన్నడ సినిమా నుంచి వచ్చిన మరో ఓవర్ డ్రమాటిక్ ఓవర్ ఎలివేషన్స్ తో కూడిన యాక్షన్ డ్రామా అని చెప్పాలి. అదే రొటీన్ ప్లాట్, అందులో మాఫియా నేపథ్యం అనవరసపు ఎలివేషన్ లు పైగా లాజిక్ లేని మరికొన్ని మూమెంట్స్ తో ఇందులో కూడా చాలా కనిపిస్తాయి.

ఇక ఈ సినిమాలో పరమ చికాకు తెప్పించే అంశాలు మాత్రం హీరోయిన్ ఇంకా హీరోయిన్ కి హీరోకి మధ్య సన్నివేశాలు. ధృవ్ సోలో సీన్స్ లేదా ఇతర సీన్స్ లో ఓకే అనిపిస్తాడు కానీ హీరోయిన్ తో సన్నివేశాలు మాత్రం బాగా చికాకు తెప్పిస్తాయి. పైగా హీరోయిన్ రోల్ కూడా హైపర్ ఆక్టివ్ గా కనిపిస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఆమెని చూసే ఆడియెన్స్ ని మరింత ఇరిటేట్ చేస్తుంది.

ఇవి సినిమాలో బాగా చిరాకు తెప్పిస్తాయి. వీటితో పాటుగా కొన్ని ఎలివేషన్స్ తో సినిమా మరీ ఓవర్ గా పోతుంది అనిపిస్తుంది. అలానే క్లైమాక్స్ ట్విస్ట్ ఒక్క నిమిషం ఓకే అనిపిస్తుంది కానీ హీరో సొంత అన్నయ్య పాత్రలో ఆ రేంజ్ టర్న్ అనేది ఒకింత లాజిక్ లేకుండా ఉంటుంది.

అప్పటివరకు ఎంతో సౌమ్యంగా నిజాయితీ అంటూ తిరిగే అతను సుడెన్ గా తన ప్రేమ కోసం సొంత తమ్ముడుకే ఎదురు తిరిగే వాడిగా నిలబడడం అనేది పొంతన ఉండదు. వీటితో పాటుగా చాలా చోట్ల పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ గట్టిగా వాడేశారు. రవి శంకర్ సొంతం గొంతు తెలుగు వెర్షన్ లో లేకపోవడం మరో వెలితిగా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్ గా ఉన్నాయి. మేకర్స్ భారీ ఖర్చు మొత్తం సెట్స్ కే పెట్టినట్లు క్లియర్ గా కనిపిస్తుంది. కొన్ని చోట్ల వి ఎఫ్ ఎక్స్ వీక్ గా ఉన్నాయి. సంగీతం కొన్ని చోట్ల బాగుంది కానీ పుష్ప స్కోర్ వాడకుండా ఉంటే బాగుండేది. పాటలు అంతేమి లేవు కొన్ని పాటలు ప్లేస్ మెంట్ చిరాకు తెప్పిస్తుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. హీరో హీరోయిన్ నడుమ ట్రాక్స్ కట్ చేయాల్సింది. పాటలు కూడా అనవసరంగా ఇరికించినట్టు అనిపిస్తుంది వీటిని కట్ చేస్తే బాగుండేది.

ఇక దర్శకుడు ప్రేమ్ విషయానికి వస్తే తన వర్క్ కొంతమేర పర్వాలేదు కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆకట్టుకోలేదు. సంజయ్ దత్ ని సాలిడ్ ప్రెజెంట్ చేశారు అలానే సెకండాఫ్ కి కావాల్సిన కాంప్లెక్సిటీని ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ లో బాగా సెటప్ చేశారు. కానీ అందుకు తగ్గ రేంజ్ లో ఇంట్రెస్టింగ్ కథనాన్ని మిగతా సగంలో నడిపించలేకపోయారు. కేవలం కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని ఎలివేషన్స్ వరకు తన వర్క్ బాగుంది కానీ మిగతా అంతా ఓవర్ డ్రమాటిక్ గా నడిపించారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘కేడీ’ ఒక రొటీన్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. సంజయ్ దత్, ధృవ్ సార్జాలపై కొన్ని మాస్ యాక్షన్ మూమెంట్స్ ఓకే అనిపిస్తాయి, కథనం ఇంకా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లే స్కోప్ ఉంది కాని దీనిని దర్శకుడు అదే రొటీన్ ఓవర్ ఎలివేషన్స్, యాక్షన్ లతో నడిపించడం పైగా హీరోయిన్ ట్రాక్ వంటివి బాగా డిజప్పాయింట్ చేస్తాయి. సో వీటితో ఈ సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకోలేదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version