‘ధురంధర్ 2’ పై జక్కన్న రివ్యూ.. మరింత బాధ్యత పెరిగిందంటున్న దర్శకుడు!

Rajamouli Aditya Dhar

ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సెట్ చేస్తున్న భారీ చిత్రమే “ధురంధర్ 2”. టాలెంటెడ్ నటుడు రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ మ్యాడ్ సీక్వెల్ కి ఇండియా వైడ్ గా యునానిమస్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ ఎక్కడ నుంచి చూసుకున్నా సరే ఈ సినిమాపై దర్శకుడు, హీరోలపై ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. మరి అలానే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కూడా ఈ సినిమాపై మెయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ వర్క్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

ఇక దీనిపై ఆదిత్య స్పందిస్తూ తనన ఎగ్జైట్మెంట్ ని పంచుకున్నాడు. జక్కన్న నుంచి రెస్పాన్స్ కి నా దగ్గర మాటలు లేవని, మీ ఆశీర్వాదం నాపై మరింత బాధ్యతని పెంచింది. ఒక ఫిల్మ్ మేకర్ గా మీరు నిర్మించిన ప్రపంచాలు చూసే మేము కూడా నేర్చుకున్నాము. మేము మా చిత్రాన్ని పూర్తిగా నిబద్దతతో ఎక్కడా అందులో సోల్ మిస్ కాకుండా తెరకెక్కించాలనే ప్రయత్నం చేసాము. మీ మాటలు భారతీయ సినిమా మరింత ఉన్నతంగా ఆలోచించేందుకు మరింత శక్తిని ఇస్తాయి. అని కృతఙ్ఞతలు ఆదిత్య ధర్ తెలిపాడు. దీనితో ఇండియాస్ నెంబర్ 1 దర్శకుడికి ఈ యంగ్ దర్శకుడు ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది.

Exit mobile version