హాట్ కేకుల్లా ‘ధురంధర్ 2’ టిక్కెట్లు.. అప్పుడే లక్షకి పైగా తెగాయి!

Dhurandhar 2

ఇప్పుడు పాన్ ఇండియా ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రమే ధురంధర్ పార్ట్ 2. దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణ్వీర్ సింగ్ కలయికలో వస్తున్న ఈ భారీ యాక్షన్ స్పై డ్రామా ఇప్పుడు బుకింగ్స్ లో భారీ రెస్పాన్స్ ని కొల్లగొడుతుంది. ధురంధర్ 2 (Dhurandhar 2) టికెట్స్ ని ప్రీమియర్స్ కోసం పెడితే ఇండియా వైడ్ గా అప్పుడే లక్షకి పైగా టికెట్లు తెగినట్టు పి వి ఆర్ వారు చెబుతున్నారు. దీనితో ఈ సినిమా హవా ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇందులో హిందీ వెర్షన్ తో పాటుగా తెలుగు వెర్షన్ బుకింగ్స్ కూడా కీలక పాత్ర పోషించాయి అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఆల్రెడీ మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే సినిమా బుకింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి. జస్ట్ టాక్ ఒకటి పడితే ఇక ధురంధర్ 2 (Dhurandhar 2) ని ఆపడం అనేది ఎవరి తరం కూడా కాదు. సో ఆ బిగ్ డే ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Exit mobile version