ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలీవుడ్ చిత్రమే “ధురంధర్ 2”. టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ స్పై యాక్షన్ డ్రామా పార్ట్ 2 పై ఎనలేని అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా దగ్గరకి వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా తాలూకా ట్రైలర్ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు.
మరి ఈ సినిమా ట్రైలర్ కి ఇప్పుడు డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని హోళీ పండుగ కానుకగా ఈ మార్చ్ 3న డిజిటల్ గా విడుదల చేయనున్నారని బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. దీనితో ధురంధర్ 2 ఫ్యాన్స్ కి ఇది సాలిడ్ న్యూస్ అనే చెప్పాలి. మేకర్స్ మెయిన్ గా తెలుగులో కూడా ఈ సినిమాని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. మరి మన దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ని ఈ సినిమా అందుకుంటుందో తెలియాలి అంటే ఈ మార్చ్ 19 వరకు ఆగాల్సిందే.
