‘ధురంధర్ 2’ టీజర్ టాక్ : బాక్సాఫీస్ రికార్డులను పాతరపెట్టేందుకు సిద్ధమవుతున్న రణ్‌వీర్ సింగ్..!

Dhurandhar 2

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ (Dhurandhar) ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ చిత్రంగా నిలిచింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ స్పై డ్రామా కళ్లు చెదిరే వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ధురంధర్ : ది రివెంజ్’ (Dhurandhar 2) చిత్రాన్ని తెరకెక్కించారు మేకర్స్. కాగా ఈ చిత్ర టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

ఈ టీజర్ ఆద్యంతం పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్‌తో నింపేశారు. రణ్‌వీర్ సింగ్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఉండబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. రెండు వైవిధ్యమైన లుక్స్‌తో రణ్‌వీర్ సింగ్ ఈ టీజర్‌లో కనిపించాడు. ఇక టీజర్ చివర్లో వచ్చే పవర్‌ఫుల్ డైలాగ్ ఈ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఇక యాక్షన్ డోస్‌కు ఏమాత్రం కొదువ లేదని ఈ టీజర్ కట్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రామ్‌పాల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో మార్చి 19న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) టీజర్‌తో అప్పుడే ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version