‘ధురంధర్’ తెలుగు రిలీజ్.. జాక్‌పాట్ ఖాయం..!

Dhurandhar-2

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు, ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2025 బాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.

అయితే, ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్‌లో రణవీర్‌కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో, తెలుగు డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని సమాచారం. డిసెంబర్ 19న రిలీజ్ చేస్తే బెటర్ అనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

అటు తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ హక్కులపై గట్టి పోటీ నెలకొందని టాక్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను విడుదల చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో ‘ఛావా’ను తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా రిలీజ్ చేసిన అనుభవంతో, ధురంధర్ కూడా ఆయనే తీసుకొస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version