
కన్నడలో దియా పేరుతో విడుదలై సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న చిత్రాన్ని అందించాలని అదే పేరుతో ఫణి శ్రీ పరుచూరి ప్రజెంట్స్ లో క్లాప్ బోర్డ్స్ ప్రొడక్షన్స్ , విభ కశ్యప్ ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్కే నల్లం ,రవి కశ్యప్ లు సంయుక్తంగా కలసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం దియా. ఖుషి, దీక్షిత్, పృద్వి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అశోక్ కె.ఎస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 19 న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో కో. డైరెక్టర్ గోపి మాట్లాడుతూ, ఒక డెస్టినీ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమని ఎలా మార్చింది అనే కాన్సెప్టు తో వస్తున్న అందమైన ప్రేమకావ్యం దియా అని అన్నారు. ఈ సినిమా కన్నడ కంటే తెలుగు అవుట్ ఫుట్ బాగా వచ్చిందని తెలిపారు. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు
చిత్ర హీరో దీక్షిత్ మాట్లాడుతూ, 10 రోజుల క్రితం ముగ్గురు మొనగాళ్ళు ప్రి రిలీజ్, ఇప్పుడు దియా ప్రి రిలీజ్ ఇలా బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత నాలుగు సంవత్సరాల నుండీ ఈ సినిమాపై వర్క్ చేస్తున్నామని తెలిపారు. దర్శక, నిర్మాతలు బాగా సపోర్ట్ చేస్తూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారని చెప్పుకొచ్చారు. కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి గొప్ప విజయాన్ని అందించారు వారికి మా ధన్యవాదాలు అని అన్నారు. కన్నడ ప్రేక్షకులకు నచ్చినట్లే తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని, ఈ నెల 19 న విడుదల అవుతున్న చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి మమ్మల్ని మాటీం ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు.
హీరోయిన్ ఖుషి మాట్లాడుతూ, ఈ కథ డీఫ్రెంట్ గా ఉంటుందని, సినిమా చాలా బాగా వచ్చిందని, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని విభాగాల్లో ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని, అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అన్నారు.
లిరిసిస్ట్ పూర్ణ చారి మాట్లాడుతూ, మూడు హృదయాల సంఘర్షణను ఒక పాట రూపంలో చేయడం జరిగిందని, నిర్మాతలు చాలా బాధ్యతగా తీసుకొని మంచి నటీనటులను సెలెక్ట్ చేసికొని మంచి చిత్రాన్ని తీయడం జరిగిందని అన్నారు. ఈ నెల 19 న విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ చూసి టీం ను ఆశీర్వదించాలని అన్నారు.
సింగర్ నరసింహ మాట్లాడుతూ, ఈ నగరానికి ఏమైంది , మొదలగు చాలా సినిమాలకు పాటలు పాడడం జరిగిందని, మొదట ఈ పాటను పెద్ద సింగర్స్ తో పాడించాలను కొన్నారు అని, కానీ పూర్ణ గారు తనకు ఇన్ఫర్మ్ చేసి ఆర్.కె గారికి రిఫర్ చేయడంతో ఆర్.కె గారు తనతో నీవే నా నీ వేనా చిట్టి లోకమంతా నాదే మారెనా పాటను పాడించారు అని అన్నారు. ఇలాంటి మంచి చిత్రం లో పాడే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.