నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 99వ సినిమా ‘డిక్టేటర్’కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నందమూరి అభిమానులకు ఊపు తెప్పించేలా అన్ని కమర్షియల్ హంగులతో భారీ ఎత్తున రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఎరోస్ ఇంటర్నేషనల్ తెలుగు సినిమా నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్‌ను దసరా కానుకగా నేడు విడుదల చేయనున్నారు.
ఇక ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, ఓ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేయగా దసరా కానుకగా విడుదల కానున్న టీజర్ ఏ స్థాయిలో అలరించనుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 50 సెకండ్ల నిడివి కలిగిన టీజర్‌ను నేడు విడు్దల కానుంది. ఇందులో రెండు పవర్ఫుల్ డైలాగులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో డిక్టేటర్ ఫస్ట్ టీజర్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగులో స్టార్ రైటర్స్ అయిన కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్ట్ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చారు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాలి చౌహాన్, అక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయాలని డిక్టేటర్ టీమ్ ప్లాన్ చేస్తోంది.
