
విక్టరీ వెంకటేష్ ఎప్పటికప్పుడు విభిన్న తరహా పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాడు. వెంకటేష్ త్వరలో మళయాళ రీమేక్ ‘దృశ్యం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీమేక్ సినిమాలతో చాలా హిట్స్ అందుకున్న వెంకటేష్ కి ‘రీమేక్ హీరో’ అని కూడా పేరుంది.
ఇదే విషయాన్ని ఆయన ముందు ప్రస్తావిస్తే ‘నన్ను ప్రేక్షకులు రీమేక్ హీరో అంటే నాకు ఏమీ ఫీలవ్వను. ఇక్కడ చేయడానికి మంచి సబ్జెక్ట్స్ ఎప్పుడు ఉండవో అప్పుడు నేను రీమేక్ సినిమాలను ఎంచుకుంటాను. నేను ఇండస్ట్రీకి స్టార్ స్టేటస్ లేదా పాపులారిటీ ఎంజాయ్ చెయ్యడానికి రాలేదు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి వచ్చాము. రీమేక్ సినిమాలు చేయడం ఒక చాలెంజ్ లాంటిది. ఒక స్టార్ హీరో మెప్పించిన పాత్రని మన స్టైల్లో చేసి ప్రేక్షకులను మెప్పించాలి. అది చాలా కష్టమైన పని. రీమేక్ చేసినా లేదా డైరెక్ట్ సినిమా చేసినా అంతా సక్సెస్ కోసమే’ అని వెంకటేష్ అన్నారు.
అలాగే దృశ్యం గురించి మాట్లాడుతూ ‘నా కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే సినిమా ‘దృశ్యం’. ఇందులో చాలా మెచ్యూర్ క్యారెక్టర్ చేసాను. ఇద్దరు పిల్లలకు తండ్రిగా కనిపిస్తాను. స్ట్రాంగ్ స్టొరీ లైన్ తో సూపర్బ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా తీసారు. ఈ సినిమా నేను చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని’ వెంకటేష్ అన్నారు.