మళయాళ మూవీ రీమేక్ చేయనున్న పివిఆర్ – దిల్ రాజు

dil-raju-pvp
ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతలు అంతా పలు భాషల్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల రీమేక్ లపై ఆశక్తి చూపుతున్నారు. వారి బాటలోనే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్స్ తీసిన టాప్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, పివిపిలు కూడా చేరారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఇద్దరు నిర్మాతలు కలిసి ఇటీవలే మలయాళంలో వచ్చిన ఓ సూపర్ హిట్ మూవీని రీమేక్ చేయనున్నారు. కానీ అది ఏ సినిమా అని వారు ఖరారు చేయలేదు కానీ ఈ సినిమాలో ముగ్గురు హీరోలు ఉంటారని చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ ఇద్దరు నిర్మాతలు కలిసి తెలుగులో ఆ సినిమాకి సరిపోయే ముగ్గురు హీరోలను అన్వేషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలను తెలియజేయనున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ ని రీమేక్ చేసారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version