మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’.. రిలీజ్ అయ్యేది ఎప్పుడో..?

Lenin

అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. మొదట ఈ చిత్రాన్ని జూన్ 25న విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ, రామ్ చరణ్ ‘పెద్ది’ కూడా అదే తేదీకి వస్తుండటంతో అఖిల్ సినిమా వాయిదా పడటం అనివార్యమైంది. దీంతో ‘లెనిన్’ బృందం ఇప్పుడు కొత్త విడుదల తేదీ కోసం కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని జూలై నెలాఖరులో విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఆగస్టు 15 వీకెండ్‌లో పెద్ద సినిమాలేవీ లేకపోతే, ఆ హాలిడే అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. లేదంటే జూలై చివరి వారంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అఖిల్ కెరీర్‌కు ఎంతో కీలకం. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత అఖిల్ నుండి వస్తున్న సినిమా కావడంతో అక్కినేని అభిమానులు ఈ ‘లెనిన్’పై భారీ ఆశలు పెట్టుకున్నారు.

Exit mobile version