విషాదం: ప్రముఖ దర్శకుడు మృతి !

kiran kumar

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు కిరణ్‌ కుమార్‌ (కేకే) ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘కేజేక్యూ: కింగ్‌.. జాకీ.. క్వీన్‌’ షూటింగ్‌ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న వేళ కిరణ్‌ కుమార్‌ మరణించడం బాధకరమని పలువురు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.

కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘కేడి’ సినిమాకు కిరణ్‌ దర్శకత్వం వహించారు. 2010లో ఈ సినిమా రిలీజ్ అయింది. నాగార్జున తనకు అవకాశం ఇవ్వడం వల్లే తాను ఇండస్ట్రీకి వచ్చినట్లు గతంలో కిరణ్‌ ఒక ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకులు సంతాపం తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. మా 123తెలుగు.కామ్ తరఫున దర్శకుడు కిరణ్‌ కుమార్‌ (కేకే) మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Exit mobile version