సాహసం చేయబోతున్న డైరెక్టర్ క్రిష్.. ఏకంగా ఏడుగురు హీరోయిన్లు..?

krish-jagarlamudi

టాలీవుడ్‌లో సోషల్ మెసేజ్ ఉన్న చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాలకు సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. దర్శకుడు క్రిష్ ఓ సినిమా చేస్తున్నాడంటే అభిమానులు ఖచ్చితంగా దాని కోసం ఆసక్తిగా చూస్తుంటారు. అయితే, గతేడాది క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ‘ఘాటి’ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో క్రిష్ ఈసారి ఓ సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నాడు.

ఈ క్రమంలో ఆయన ఓ ఇంట్రెస్టింగ్ జోనర్ కథను రెడీ చేస్తున్నాడట. ఇక ఈ కథలో ఏకంగా ఏడుగురు హీరోయిన్లు ఉంటారని.. ట్రెక్కింగ్ నేపథ్యంలో సాగే ఓ అడ్వెంచర్ చిత్రంగా ఈ మూవీ రాబోతుందని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్యాస్టింగ్ వర్క్‌లో క్రిష్ బిజీగా ఉన్నాడట.

ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి కాగానే ఈ చిత్రాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాడని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే క్రిష్ ఈసారి సాహసం చేసేందుకు సిద్ధమవుతున్నాడా..? అనేది వేచి చూడాలి.

Exit mobile version