బన్నీతో మూవీ చేసేందుకు ప్రయత్నిస్తున్న పరశురామ్?

Allu Arjun Parasuram

దర్శకుడు పరశురామ్ పెట్ల ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు పరశురామ్ నాగచైతన్యతో ఓ సినిమాను చేయబోతున్నాడు.

ఇక నాగచైతన్యతో సినిమాను పూర్తి చేశాక తన తదుపరి సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయాలని దర్శకుడు పరశురామ్ ప్రయత్నాలు చేస్తున్నాడట. ‘గీత గోవిందం’ సినిమా నుంచి గీతా ఆర్ట్స్‌తో పరశురామ్ కు మంచి సాన్నిహిత్యం ఉండడంతో అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడని, ఇప్పటికే ఆ దిశగా పనులను మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ఆయన ప్రయత్నాలు ఎంతవరకూ నిజమవుతాయో చూడాలి మరీ.

Exit mobile version