యుద్ధం అప్పుడే ముగియదు, సిద్ధంగా ఉండండి- పూరి

Puri Jagannadh

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కరోనా బాధితుల సంఖ్య లక్షల్లోకి చేరింది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వ్యాధిగ్రస్థుల సంఖ్య లక్ష దాటిపోవడం డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఇక భారత్ లోకూడా కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి దాటిపోయాయి. ఇప్పటికే ప్రధాని మోడీ దేశ ప్రజల భద్రత, ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 14వరకు టోటల్ లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.

ఈ పరిణామాలపై దర్శకుడు పూరి జగన్నాధ్ స్పందించారు. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే సూచనలు లేవని చెప్పారు. అలాగే కరోనా పై యుద్ధం అప్పుడే ముగియదన్న పూరి, లాక్ డౌన్ మే లేదా జూన్ వరకు పొడిగించే అవకాశం కలదు అన్నారు. మిగతా దేశాలలో ఉన్న పరిస్థితులతో పోల్చుకుంటే మనం బెట్టర్ అన్న పూరి, ఎటువంటి పరిస్థితులనయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు.

Exit mobile version