బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన స్పై థ్రిల్లర్ ‘దురంధర్’ (దురంధర్: ది రివెంజ్) బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే రీసెంట్ గానే ఇంటర్నేషనల్ ఆడియెన్స్ కోసం పార్ట్ 2 ని అది కూడా పూర్తిగా అన్ కట్ వెర్షన్ ని నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చింది. జూన్ నుంచి ఇండియాలో జియో హాట్ స్టార్ తీసుకురానుంది. కానీ ఇప్పుడు క్రేజీ ట్విస్ట్ గా పార్ట్ 1 కూడా అన్ కట్ వెర్షన్ ఇండియన్ ఆడియెన్స్ కి ఎక్స్ క్లూజివ్ గా ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాయి.
ఇండియాలో అన్ కట్ వెర్షన్ తో..
సెన్సార్ కట్స్ లేకుండా ‘రా అండ్ అన్దేఖా’ (Raw & Undekha) పేరుతో ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ వారు అనౌన్స్ చేశారు. ఆల్రెడీ పార్ట్ 2 తాలూకా అన్ కట్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ఓవర్సీస్ ఆడియెన్స్ ని అలరిస్తుంది. కానీ నెట్ ఫ్లిక్స్ వారు పార్ట్ 1 ని అదే ఫార్మాట్ లో అనౌన్స్ చేసి క్రేజీ ట్విస్ట్ ఇచ్చారు. అది కూడా తెలుగు ప్రేక్షకుల కోసం ఇండియాలో ఈ మే 22 నుంచి నెట్ఫ్లిక్స్లో ‘దురంధర్’ తెలుగు వెర్షన్ను ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు రివీల్ చేశారు.
మరో ట్విస్ట్ మరో ఓటిటిలో..
పార్ట్ 1 ని మొదట నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చారు. పార్ట్ 2 ని హాట్ స్టార్ సొంతం చేసుకున్నారు. కానీ పార్ట్ 1 రా వెర్షన్ ని నెట్ ఫ్లిక్స్ తో పాటుగా ఇండియాలో జియో హాట్ స్టార్ వారు కూడా అదే మే 22 డేట్ లో స్ట్రీమింగ్ కి తీసుకురానున్నట్టు ఖరారు చేశారు. ఇది మాత్రం ధురంధర్ ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్ అనే చెప్పాలి. సో ఈ రెండు ఓటిటిలలో రేపటి నుంచే ధురంధర్ పార్ట్ 1 పక్కా రా వెర్షన్ ని చూసి ఎంజాయ్ చేయొచ్చు.
