ఎన్.టి.ఆర్ కి కథ సిద్దం చేస్తున్న శ్రీ కాంత్ అడ్డాల.?

Srikanth_Addala
కుటుంబ బాంధవ్యాలకు పెద్ద పీత వేసే ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమాలను తీసి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ శ్రీ కాంత్ అడ్డాల. శ్రీ కాంత్ అడ్డాల ప్రస్తుతం నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ ‘ముకుందా’ అనే సినిమా చేస్తున్నాడు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో సాగే పల్లెటూరి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

ఈ సినిమా చివరి దశలో ఉండగానే శ్రీ కాంత్ అడ్డాల తన తదుపరి సినిమా కోసం సిద్దమవుతున్నాడు. తన తదుపరి సినిమా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ప్లాన్ చేస్తున్నాడు. మాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటికే ఎన్.టి.ఆర్ – శ్రీకాంత్ అడ్డాల మధ్య కథా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్.టి.ఆర్ పూరి జగన్నాధ్ సినిమా తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

Exit mobile version