‘దోచేయ్‌’కి ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్..!

‘దోచేయ్‌’కి ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్..!

Published on Apr 22, 2015 5:12 PM IST

Dochey
‘స్వామిరారా’ సినిమాతో తెలుగులో క్రైమ్ కామెడీ సినిమాలకు ఒక కొత్త దారిని ఏర్పరచిన దర్శకుడు సుధీర్ వర్మ. తాజాగా సుధీర్ వర్మ నాగచైతన్యతో ‘దోచేయ్’ పేరుతో మరో సరికొత్త కథాంశంతో క్రైమ్ కామెడీ నేపథ్యంలో సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్‍గా నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 24న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమౌతోంది.

‘దోచేయ్’ సినిమా విషయంలో మొదట్నుంచీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. స్వామిరారా వంటి హిట్ సినిమా తర్వాత సుధీర్ వర్మ తెరకెక్కించిన సినిమా కావడం, చైతూ సరికొత్తగా ఓ క్రైమ్ కామెడీ సినిమాలో కనిపించనుండడం ఈ సినిమా పట్ల ఆసక్తిని రేకెత్తించాయి. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ చూసినవారంతా ఈ సినిమా హిట్ అయినట్లే అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

దర్శకుడు సుధీర్ వర్మ కూడా స్వామిరారా సినిమా కంటే బలమైన స్క్రిప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. ఈ సినిమా విషయంలో ఇండస్ట్రీ తరపున ప్రీ పాజిటివ్ టాక్ వినబడుతోంది. ఇక ఇన్ని అంచనాల మధ్య భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా? సినిమా విడుదలకు ముందున్న పాజిటివ్ వైబ్రేషన్ సినిమా విడుదలయ్యాక కూడా నిలబడుతుందా? అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే!

తాజా వార్తలు