పవన్ అభిమానులకు రేణు దేశాయ్ ఇచ్చింది సలహానా.. హెచ్చరికా ?

renu desai

మన తెలుగు పరిశ్రమలో అభిమానులు తమ స్టార్ హీరోల కుమారుల్ని కూడ హీరోల స్థాయిలో ట్రీట్ చేయడం మామూలు విషయమే. దీని పట్ల హీరోలు కూడ పెద్దగా పట్టింపులు చూపరు. కానీ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ విషయంలో మాత్రం ఈ ఆంక్షలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళితే పవన్ మాజీ సతీమణి, అకీరా నందన్ తల్లి రేణు దేశాయ్ కు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం అలవాటు.

తాజాగా ఆమె అకీరా నందన్ ఫోటో ఒకదాన్ని షేర్ చేసి అతన్ని తను కానీ, అతని తండ్రి కానీ జూనియర్ పవర్ స్టార్ అని పిలవరు. కాబట్టి మీరు కూడ పిలవకండి. ఒకవేళ అలా ఎవరైనా పిలిచినా, కామెంట్ చేసినా మా పిఆర్ అసిస్టెంట్ వాళ్ళను వెంటనే బ్లాక్ చేస్తారు అంటూ గమనిక ఇచ్చారు. కొందరు అభిమానులు దీన్ని రేణు దేశాయ్ తన కుమారుడు సొంత వ్యక్తిత్వంతో ఎదగాలని కోరుకుంటున్నారని సపోర్ట్ చేస్తుంటే ఇంకొందరేమో దీన్నీ సలహా అనుకోవాలా, లేక హెచ్చరిక అనుకోవాలా అర్థం కావడంలేదని పెదవి విరుస్తున్నారు.

Exit mobile version