అప్పుడెప్పుడో కృత్రిమ మేధస్సు (AI – ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) తో భవిష్యత్తులో పెను ఉపద్రవాలు తప్పవు అని పలువురు దర్శకులు భారీ సినిమాలు తీసి చూపించారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అటు వైపు అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది. కేవలం ఈ కొన్నాళ్ల లోనే ఏఐ వాడకం అత్యంత వేగంగా పెరుగుతూ వస్తుంది. దీనితో ఏది నిజం ఏది అబద్దం అనేది కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే దీనిని మంచి కోసం వాడితే పర్వాలేదు కానీ చెడు మార్గాలకి వాడితే ఆ సినిమాల్లో చూపించిన యుద్ధాలు వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదు.
అయితే ఇదే ఏఐ ప్రస్తావన సినీ రంగంలో కూడా చాలా వినిపిస్తుంది. ఇటీవల ఏ సినిమాకి చూసుకున్నా ఈ విజువల్ ఏ ఐ తో చేసేసారు, అని సింపుల్ గా తీసి పారేస్తున్నారు కూడా. దీనితో అక్కడ నిజంగా చిత్ర యూనిట్ విజువల్ ఎఫెక్ట్స్ కి ఎఫర్ట్స్ పెట్టినా అవి నిజమో కాదో తెలియని విధంగా ప్రేక్షకుడి మైండ్ ఏఐ కి రిజిస్టర్ అయ్యింది. ఇప్పుడు ఇదే ఏఐ తో భవిష్యత్తులో ఏకంగా ఫుల్ లెంగ్త్ సినిమాలు కూడా తీయడం సాధ్యమే అని ప్రస్తావన రానే వచ్చింది. ఇప్పుడు ఊహించని విధంగా నెట్టింట ఓ షాకింగ్ ఏఐ చిత్రం తాలూకా క్లిప్ ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోతుంది.
Dor Brothers 200 Million AI Film – ఒక్కరోజులో 1800 కోట్ల విలువైన సినిమా విజువల్స్ వైరల్
సోషల్ మీడియా డార్ బ్రదర్స్ అనే అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఎపెక్స్ (Apex) ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా తాలూకా క్లిప్ వైరల్ గా మారింది. ఒక లేడీ ఊహించుకున్న కల, అందులో పెను ప్రమాదం, ప్రపంచం అంతం అయిపోతుంది అనే రీతీలో అత్యంత సహజమైన విజువల్స్, సౌండింగ్ తో అమెరికా నేపథ్యంలో సాగిన హై టెన్షన్ యాక్షన్ క్లిప్ ఇది. ఇది చూసిన వారు మాత్రం హాలీవుడ్ పనైపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ డార్ బ్రదర్స్ అనేవారు తాము 200 మిలియన్ డాలర్స్ సినిమాని తాము కేవలం ఒక్క రోజులోనే చేసినట్టు చెప్పారు. మరిన్ని క్లిప్స్ ఈ సినిమా నుంచి వదులుతామని ప్రకటించారు.
Who are these Dor Brothers – ఎవరీ డార్ బ్రదర్స్?
యోనాథన్ డార్ అనే వ్యక్తి ఇంకొందరు సహచరులతో స్టార్ట్ చేసిన ఈ ఫ్యూచరిస్టిక్ ఏఐ స్టూడియో తోనే పలు ఊహించని విజువల్ వండర్స్ ని తమ స్టూడియో నుంచి రెడీ చేశారట. జర్మన్ ఏఐ స్టూడియో లోనే కేవలం పలు ఏఐ టూల్స్ తోనే ఈ తరహా సినిమాలు ఇంకా వీడియో గేమ్స్ లాంటి వాటి వీడియో లని తయారు చేసి ఆశ్చర్యం కలిగిస్తున్నారు. వీరి ప్రయోగాలు అన్నీ సినీ రంగంలో అయ్యే ఖర్చుని బాగా తగ్గిస్తాయని ఓ వెర్షన్ ఉంది కానీ రియల్ టైం గ్రాఫిక్ డిజైనర్లు అలాగే ఎన్నో హాలీవుడ్ వి ఎఫ్ ఎక్స్ స్టూడియోస్ కి మాత్రం ఇది ఖచ్చితంగా డేంజర్ అనే చెప్పాలి.
ఇక మున్ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
We just made a $200,000,000 AI movie in just one day.
Yes, this is 100% AI. pic.twitter.com/TMotM7rguY
— The Dor Brothers (@thedorbrothers) February 16, 2026
