సైలెంట్‌గా దూసుకుపోతున్న ‘దృశ్యం-3’.. డబుల్ సెంచరీ క్రాస్..!

Drishyam-3

మలయాళ స్టార్ మోహన్ లాల్, జీతూ జోసెఫ్ ల క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, జార్జ్ కుట్టి కథను ఎలా ముగించాడనే ఆసక్తితో ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. దీంతో కేవలం పది రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది.

మలయాళంలో ‘మంజుమ్మల్ బాయ్స్’ వంటి రికార్డులను వెనక్కి నెట్టి వేగంగా ఈ ఫీట్ సాధించిన చిత్రంగా నిలిచింది. తెలుగులో ఒరిజినల్ వెర్షన్ విడుదలైనప్పటికీ డీసెంట్ వసూళ్లు రాబట్టింది. అయితే జూన్ 4న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల కానుండటంతో, కేరళ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ‘దృశ్యం 3’ రన్ ముగింపునకు రానుంది.

కాగా, ఈ భారీ సక్సెస్ నేపథ్యంలో ‘దృశ్యం 4’ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి ఈ మూవీ టోటల్ రన్‌లో ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

Exit mobile version