అరకు లో షూటింగ్ జరుపుకుంటున్న ‘దృశ్యం’

Venkatesh
కేరళ లో మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న వెంకటేష్ తాజా చిత్రం ‘దృశ్యం’ లో షూటింగ్ జరుపుకుంటుంది. కొంత కాలం క్రితం కొత్త షెడ్యూల్ ప్రారంభం అవ్వగా చిత్రం అరకు సింహాచలం మరియు మరి కొన్ని పరిసర ప్రాంతాల్లో చిత్రీకనుంచనున్నారని సమాచారం.

వెంకటేష్ షూటింగ్ కోసం అరకు పరిసర ప్రాంతాలకి వచ్చారని తెలియగానే వెంకటేష్ అభిమానులు ఆయనను ఒక్క సారి చూడడానికి హోటల్ కి చేరుకున్నారు. శ్రీ ప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో మీనా నదియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ రాజ్ కుమార్ దియేటర్స్ ప్రై లిమిటెడ్ మరియు వైడ్ ఎంగిల్ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు.
‘దృశ్యం’ మలయాళం లో చాలా పెద్ద హిట్ అయిన ఒక చిత్రానికి రీమేక్. మలయాళం ‘దృశ్యం’ లో మోహన్ లాల్ మీనా జంట గా నటించారు. ఈ చిత్రం కేరళ లో రికార్డ్స్ ని బద్దలు కొట్టింది అంతే కాకుండా ముంబై లాంటి నగరాలలో పది వారల పాటు ప్రదర్శింపబడింది. ‘దృశ్యం’ తమిళ్ రీమేక్ లో కమల్ హాసన్ నటించనున్నాడు.

Exit mobile version