
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’. ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి అటు విమర్శకుల నుండి, ఇటు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ఒక్క యుఎస్ లో కేవలం రెండు రోజుల్లోనే కోటి రూపాయల మార్క్ ని క్రాస్ చేసింది.
వారం కలెక్షన్స్(డాలర్స్ లో)
గురువారం(ప్రీమియర్స్) $ 13,859
శుక్రవారం $ 65,365
శనివారం $ 88,431
మొత్తం $ 167,655 (ఇండియన్ కరేనీ ప్రకారం 1.01 కోట్లు)