దేవీశ్రీ ప్రసాద్ ఫాదర్ కన్నుమూత

దేవీశ్రీ ప్రసాద్ ఫాదర్ కన్నుమూత

Published on Dec 14, 2015 8:27 AM IST

satyanand
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ కుటుంబంలో ఈ రోజు ఒక్కసారిగా విషాదం సంతరించుకుంది. దానికి కారణం దేవీశ్రీ ప్రసాద్ ఫాదర్ మరియు ప్రముఖ సినీ రచయిత అయిన గొర్తి సత్యమూర్తి గారు కన్నుమూశారు. ఈ రోజు ఉదయం చెన్నైలోని స్వగృహంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన ఇంట్లోనే మరణించారు. దీనితో దేవీశ్రీ ప్రసాద్ ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా శోఖసంద్రంలో మునిగింది.

సత్యమూర్తి గేయ రచయితగా తెలుగులో సుమారు 90కి పైగా సినిమాలకు పనిచేసారు. ‘దేవత’ సినిమాతో రచయితగా పరిచయమైన ఆయన ఆ తర్వాత ఖైదీ నెం 786, చంటి, చాలెంజ్, భలే దొంగ, అభిలాష, బంగారు బుల్లోడు లాంటి ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేసారు. ఈ రోజు సాయంత్రం చెన్నైలోనే సత్యమూర్తి అంత్యక్రియలు చేయనున్నారు.

పితృ వియోగంతో బాధలో ఉన్న దేవీశ్రీ ప్రసాద్ మరియు అతని కుటుంబ సభ్యులకు 123తెలుగు.కామ్ తరపున సంతాపం తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు