
రామ్ హీరోగా ‘శివమ్’ పేరుతో ఓ హై వోల్టేజ్ లవ్‌స్టోరీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అక్టోబర్ 2న పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు. రామ్ సొంత బ్యానర్ అయిన స్రవంతి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. స్రవంతి రవికిషోర్ నిర్మాతగా పెద్ద ఎత్తున తెరకెక్కిన ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను ఈనెల 12న పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
స్రవంతీ మూవీస్ సంస్థ సినీ పరిశ్రమలో 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో వస్తోన్న శివమ్ సినిమా, ఆ సంస్థకు ప్రత్యేకంగా నిలవనుంది. ఈ క్రమంలోనే శివమ్ సినిమాను విజువల్‌గా గ్రాండ్‌గా ఉండేలా చూసుకున్నారు. ఇక అదేవిధంగా ఆడియో రిలీజ్‌ను కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్లో దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ పర్ఫామెన్స్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రామ్ సరసన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్గా నటించారు. ఇక ‘శివమ్’ సినిమాతో పాటు రామ్ హీరోగా నటిస్తోన్న ‘హరికథ’ కూడా స్రవంతి మూవీస్ బ్యానర్లోనే రూపొందుతోంది.