సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్‌గా రాబోతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. కాగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాశీఖన్నా మొదటసారి తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెబుతుంది. ఈ విషయం గురించి ఆమె ట్వీట్ చేస్తూ.. ‘నేను మొదటసారి ‘వరల్డ్ ఫేమస్ లవర్’కి డబ్బింగ్ చెబుతున్నాను. కానీ, నా వాయిస్, నా డిక్షన్ పాత్రకు తగ్గట్లు ఉండదని నాకు ఎప్పుడూ భయం ఉంటుంది. అయితే, అవుట్ ఫుట్ చూశాక నేను ఆశ్చర్యపోయాను. మీరందరూ ఈ చిత్రంలో నా వాయిస్ ఎప్పుడు వినేదాకా నేను ఎదురుచూడలేను ఏమో.’అని రాశీఖన్నా పోస్ట్ చేసింది.
కాగా ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ గత చిత్రం డియర్ కామ్రేడ్ ఆశించిన విజయం సాధించలేక పోయింది. దాంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. మొత్తానికి టైటిల్ బాగా క్యాచీగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
