డబ్బింగ్ చెప్పడం చాలా ఇష్టం – శృతి హాసన్

sruthihasan
సింగర్ గా, హీరోయిన్ గా, కమల్ హాసన్ కూతురుగా ప్రేక్షకులకు పరిచయమైన శృతి హాసన్ ‘పూజై’ సినిమాలో తన సొంత గొంతును వినిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డబ్బింగ్ ను చెన్నైలో చెప్పడం ప్రాంభించారు శృతి హాసన్.

‘పూజై’ సినిమా డబ్బింగ్ చెప్పడంలో బిజీ బిజీగా ఉన్నాను. డార్క్ రూమ్స్, గత జ్ఞాపకాలు… నా చిన్నప్పటి నుండి డబ్బింగ్ చెప్పడం అంటే చాలా ఇష్టం. అంటూ సోషల్ మీడియాలో శృతి హాసన్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

విశాల్ సరసన తొలిసారిగా నటిస్తున్న శృతి హాసన్ ఈ సినిమాలో రెండు పాటలను కూడా పాడడం విశేషం. సింగం’, ‘యముడు’ సినిమాల దర్శకుడు హరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. తెలుగులో ఈ సినిమాను ‘పూజ’ పేరుతో అనువదిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Exit mobile version