900 థియేటర్స్ లో రిలీజ్ కానున్న విష్ణు ‘డైనమైట్’

Dynamite
ప్రతి సినిమాతోనూ నటునిగా తనలోని టాలెంట్ ని నిరూపించుకొని నటునిగా తన స్థాయిని పెంచుకుంటున్న హీరో మంచు విష్ణు. ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘రౌడీ’, ‘అనుక్షణం’, ‘ఎర్రబస్సు’ లాంటి కదానితో ఒకటి సంబంధం లేని సినిమాలను చేసుకుంటూ వస్తున్న విష్ణు చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డైనమైట్’. పెర్ఫార్మన్స్ కి, ఇంటెన్స్ ఉన్న సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రణిత హీరోయిన్ గా నటించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న అనగా రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అంతే కాకుండా ఇండియా, యుఎస్, యుకె, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఈ సినిమాకి సెప్టెంబర్ 3న ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు.

హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాకి ఇండస్ట్రీలో పూర్తి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్ర టీం ప్రీ ప్రమోషనల్ టూర్ అని సినిమాని భీభత్సంగా ప్రమోట్ చేసారు. దాంతో సినిమాకి ఓపెనింగ్స్ భారీగా వస్తున్నాయి. ఈ సినిమా మంచు విష్ణు కెరీర్లో ఇప్పటి వరకూ రిలీజ్ కానన్ని థియేటర్స్ లో రిలీజ్ కానుండడం విశేషం. ఆంధ్ర, తెలంగాణ, మిగిలిన ఇండియాతో పాటు ఓవర్సీస్ స్క్రీన్స్ కూడా కలుపుకొని సుమారు 900 థియేటర్స్ లో రిలీజ్ కానుందని సమాచారం. అలాగే ఒక్క నైజాం లోనే 210కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మంచు విష్ణు చేసిన రియలిస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్ మరియు స్పీడ్ గా సాగే స్క్రీన్ ప్లే ఈ సినిమాకి హైలైట్ కానుంది. మంచు విష్ణుతో పాటు ప్రణిత కూడా రియలిస్టిక్ స్టంట్స్ చేసిన ఈ సినిమాలో జెడి చక్రవర్తి మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు.

Exit mobile version