ప్రమోషన్స్‌తో సందడి చేస్తోన్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’

Subramanyam-for-Sale
‘పిల్లా.. నువ్వులేని జీవితం’ అంటూ మెగా ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమకు సూపర్ ఎంట్రీ ఇచ్చిన హీరో సాయిధరమ్ తేజ్. మొదటి సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న ఈ హీరో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే సినిమాను విడుదలకు సిద్ధం చేసేసిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు. సెప్టెంబర్ 24న అంటే మరో ఇరవై రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఇరవై రోజుల ముందునుంచే సుబ్రమణ్యం ఫర్ సేల్ టీమ్ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. హీరోయిన్ రెజినా ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో భాగం పంచుకుంటుండగా, మిగతా యూనిట్ కూడా త్వరలోనే ప్రమోషన్స్‌తో సందడి చేయనున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే పాజిటివ్ బజ్ సంపాదించుకున్న ఈ సినిమా, ట్రైలర్ రిలీజ్ తర్వాత మరింత క్రేజ్ తెచ్చుకుంది. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో ఈ సినిమా అందరినీ అలరించేలా ఉండనుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.

Exit mobile version