
ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ, ఈవివి సత్యనారాయణల శిష్యుడు క్రిషన్ దర్శకుడిగా, హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఈ మనసే’. దీపికా దాస్ హీరోయిన్ గా నటించింది. ప్రపంచంలో జరిగే ప్రతి అనర్ధానికి మూల కారణం ‘ఈ మనసే’ అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటీవల సినిమా ట్రైలర్లు చూసిన కోడి రామకృష్ణ గారు మెచ్చుకున్నారని క్రిషన్ తెలిపారు.
తాగుబోతు రమేష్, సూర్య, సత్యకృష్ణన్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను ఊటీ, కేరళ, కూర్గ్ , హైదరాబాద్ వంటి అందమైన లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంది. సుభాస్ ఆనంద్ స్వరాలను సమకూర్చగా జీవన్ థామస్ నేపధ్య సంగీతం అందించారు. జి.కిషన్ ప్రసాద్ నిర్మాత.