‘కథానాయకుడు’లో మరో టాలెంటెడ్ హీరోయిన్ !

ntr3

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’లో మరో యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నటించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా ‘కథానాయకుడు’లో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈషా రెబ్బా మంచి నటి అని ఇప్పటికే మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది.

కాగా త్వరలో జరగబోయే షెడ్యూల్ లోనే ఈషా మరియు బాలయ్య పై చిత్రబృందం కొన్నికీలకమైన సన్నివేశాల తాలూకు సీన్స్ ను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఈషా రెబ్బా ‘సుబ్రహ్మణ్యపురం’లో సుమంత్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీన విడుదల కానుంది.

ఇక ఎన్టీఆర్ బయోపిక్ కి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న బయోపిక్ మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version