​సుమతీ శతకం నుండి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడీ సాంగ్ రిలీజ్!

Untitled 114

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం “సుమతీ శతకం”. ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన లభించగా, తాజాగా ఈ చిత్రం నుండి ‘ఎక్కడే ఎక్కడే’ అనే మెలోడీ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

​సుభాష్ ఆనంద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ ప్రేమ గీతాన్ని తిరుపతి జావన రచించగా, ప్రముఖ గాయకుడు ధనుంజయ్ సీపన అద్భుతంగా ఆలపించారు. అర్థవంతమైన సాహిత్యం, ఆహ్లాదకరమైన బాణీలతో సాగే ఈ పాట ప్రస్తుతం ఆదిత్య మ్యూజిక్ ద్వారా అందుబాటులో ఉంది. ఈ మెలోడీ సాంగ్ త్వరలోనే చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై అంచనాలను పెంచుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

​ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జేడీవీ ప్రసాద్ వంటి పలువురు నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ఎస్. హలేష్ సినిమాటోగ్రఫీ అందించగా, నహిద్ మహమ్మద్ ఎడిటర్‌గా వ్యవహరించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version